వైసీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

వైసీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు
X

టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై 14 పేజిల లేఖను అందించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని లేఖలో వివరించారు. బీసీలు, దళితులపై వైసీపీ దాడులు చేస్తోందని.. ఎన్నికల కమిషనర్ ను తొలగించిన విధానం అప్రజాస్వామికమని అన్నారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ను అసభ్యపదజాలంతో దూషించారని గవర్నర్ కు వివరించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వైసీపీ నేతల వలనే కరోనా కేసులు పెరుగుతున్నాయని లేఖలో ఆరోపించారు. ఏడాది పాలనలో ఇసుక, భూసేకరణ, మద్యంలో అక్రమాలు జరిగాయని గవర్నర్ కు చంద్రబాబు వివరించారు.

Tags

Next Story