ఊరట కలిగిస్తున్న కరోనా రికవరీ రేటు

ఊరట కలిగిస్తున్న కరోనా రికవరీ రేటు
X

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. అయితే, అదే స్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఉండటంతో కాస్తా ఊరట అనిపిస్తుంది. రికవరీ రేటు 58.24 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 13, 940 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 2, 85, 636కు కోలుకున్నారు. మొత్తం నమోదవుతున్నకేసులల్లో 70శాతం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోనే నమోదవుతున్నాయి. అటు, కరోనా టెస్టులకు గడిచిన 24 గంటల్లో 11 కొత్త ల్యాబ్ లు ప్రారంభించారు. దీంతో మొత్తం ల్యాబ్‌ల సంఖ్య 1016కు చేరుకుంది.

Tags

Next Story