ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. కోటీ 10 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. కోటీ 10 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈరోజు వరకు నమోదైన కేసుల సంఖ్య 1,09,85,656కి చేరుకుంది. ఇప్పటివరకూ 61,40,827 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరగటంతో యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకూ 5,24,088 మంది మృతి చెందారు.

అమెరికాలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 50,700 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం మొత్తం కేసులు సంఖ్య 28,37,189కి చేరుకుంది. అటు, అమెరికాలో కరోనాతో 1,31,485మంది మృతి చెందారు.

భారత్ లో కూడా కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఒక్కరోజే సుమారు 21వేల కొత్త కేసులు నమోదవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 20,903 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. అయితే, సుమారు అదే సంఖ్యలో రికవరీ రేటు ఉండటం కాస్తా ఊరట లభిస్తున్నట్టు భావించవచ్చు. గడిచిన 24గంటల్లో 20,032 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 6,25,544కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story