దేశంలో కరోనా: ఒక్క రోజులో 20 వేల మంది డిశ్చార్జ్.. 21 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా: ఒక్క రోజులో 20 వేల మంది డిశ్చార్జ్.. 21 వేల పాజిటివ్ కేసులు
X

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించినా కొత్త ఊరట కలిగించే అంశం కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా పెరగడం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారి. అయితే కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. శుక్రవారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 18,213 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 3,79,893 మంది కోలుకున్నారు. మరో 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ రికవరీ రేటు 60 శాతం ఉండగా మరణాల రేటు 2.6 శాతంగా ఉంది. గత నెలతో పోలిస్తే కరోనా మరణాల రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. కాగా, తమిళనాడులో కొవిడ్ బాధితుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇప్పటి వరకు 1321 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాలు దాదాపు 45 శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ మరణించిన వారి సంఖ్య 8,178కి చేరుకుంది. లక్షా 86 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 92,175 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2864 మంది మరణించారు. గుజరాత్ లో 33,913 పాజిటివ్ కేసులు వస్తే అందులో 1886 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Next Story