ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న మహమ్మారి

X
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. అటు కరోనా కేసులు, ఇటు కరోనా మృతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు మొత్తం 1,13,82,890కి చేరాయి. మృతుల సంఖ్య 5,33,474కి చేరాయి. అమెరికాలో సుమారు ముప్పై లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,35,770కి చేరింది. అమెరికాలో ఇప్పటివరకూ 1,32,318 మంది మృతి చెందారు. భారత్ లో కూడా ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,850 కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. కరోనా ప్రభావం ప్రజాఆరోగ్యంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
