వచ్చే నెలలో పెళ్లిళ్లు.. ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం

వచ్చే నెలలో పెళ్లిళ్లు.. ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం

రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల పేరుతో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తే కరోనాని కట్టడి చేయడం ఎవరి తరమూ కాదని ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వివాహ వేడుకలకు ఎంతమందిని ఆహ్వానించాలి అనే నిర్ణయంపై కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేది. కానీ అనుమతులు ఆలస్యం అవుతుండడంతో ఇకపై ఈ వ్యవహారాలను తాసిల్దార్ కి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అయితే పెళ్లిళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, మిగతా ఏ ఫంక్షన్లు జరిగినా అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొంది.

వధూవరులు ఇరువైపులా ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. వివాహ అనుమతి కోరు వారు తప్పనిసరిగా వివాహ శుభలేఖతో పాటు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తాసిల్దార్ కు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాలను జతచేయాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story