ప్రపంచవ్యాప్తంగా కోటి యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కోటి యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. నేటికి మొత్తం కరోనా కేసులు కోటి 50 లక్షలకు చేరువలో చేరాయి. అటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటికవరకూ ప్రపంచవ్యాప్తంగా 1,48,55,107 పాజిటీవ్ కేసులు నమోదవ్వగా.. 6,13,248 మంది మృతి చెందారు. కాగా, కరోనా నుంచి ఇప్పటివరకూ 89,07,167 మంది కోలుకున్నారు. అటు, అమెరికాలోని కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 39,61,429 కేసులు నమోదవ్వగా.. 1,43,834 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 18,49,989 మంది కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story