60వేలుకు చేరువలో ఏపీ కరోనా కేసులు

60వేలుకు చేరువలో ఏపీ కరోనా కేసులు
X

ఏపీలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 4,944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. కాగా.. ఇప్పటివరకూ 25574 మంది కరోనా నుంచి కోలుకోగా.. 32336 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అటు, గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ758 మంది కరోనా కాటుకి బలైయ్యారు. ఇప్పటి వరకూ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అక్కడ 7756 మంది రోగులు ఉండగా.. తరువాతి స్థానంలో 7119కేసులతో కర్నూలు జిల్లా రెండోస్థానంలో ఉంది. కాగా.. విజయనగరం జిల్లాలో 1696 మందితో తక్కువ కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story