ఏపీలో కరోనా విలయతాండవం.. మరోసారి పదివేలకి పైగా కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం.. మరోసారి పదివేలకి పైగా కేసులు
X

ఏపీలో కరోనా భయంకరంగా విజృంభిస్తుంది. వరుసగా రెండో రోజు పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,068 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,167 మందికి కరోనా సోకింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,30,557కు చేరింది. అటు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 68 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,281 చేరాయి. గత రెండు రోజులు వరుసగా పదివేలకు పైగా కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story