శుభవార్త.. కరోనా వైరస్‌‌ను చంపే ఫేస్‌మాస్క్

ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో పోరాటం చేస్తూ.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఓ శుభవార్త చెప్పింది. ఈ సంస్థ కరోనా వైరస్ ను చంపే ఫేస్ మాస్క్ ను తయారు చేసింది. ఈ కరోనా మహమ్మారి వలన ఫేస్ మాస్క్ మన జీవనవిధానంలో తప్పనిసరి అయిపోయింది. అయితే, మనం వాడే మాస్కులు అన్ని.. వై రస్ ను మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉంచేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ, ఈ సంస్థ తయారు చేసిన ఈ మాస్క్ మాత్రం వైరస్ ను అంతం చేస్తుంది. నానోటెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ కిల్లర్ మాస్క్‌ను అభివృద్ధి చేసినట్టు సంస్థ యాజమాన్యం చెబుతుది. దీనిని వాష్ చేసుకుంటూ 60 నుంచి 150 సార్లు వ‌రకూ ఉపయోగించుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. ఈ మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి, దానిని చంపేస్తుంది. ఈ మాస్క్ కు భారత్ తో సహా.. అమెరికన్ ల్యాబ్ లలో కూడా ఆమోదం లభించింది. అదేవిధంగా ఈ మాస్క్‌కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫైడ్ చేసింది. అలాగే ఈ మాస్కుల త‌యారీకి, వాడకానికి కూడా అనుమ‌తి ల‌భ్య‌మ‌య్యింది. ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌స్తే.. రూ. 300 నుంచి 500 రూపాయల మధ్య ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

Tags

Next Story