సీఎం జగన్‌కి 48 గంటలు టైం ఇస్తున్నా: చంద్రబాబు

X
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు.. సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. అధికారంలో వచ్చిన తరువాత మాటతప్పారని అన్నారు. మాటతప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ప్రజల్లోకి వెళ్థామని సవాల్ విసిరారు. రాజధాని అంశం ఐదుకోట్లు ప్రజలదని.. కులాలకు, మతాలకు సంబంధం లేనిదని అన్నారు. ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికల తరువాత మరోమాట చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళదామని.. దీనికి 48 గంటలు జగన్ కి టైం ఇస్తున్నాని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలం అందరం రాజీనామా చేస్తామని.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
