దేశంలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

దేశంలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

దేశంలో కరోనా విజృంభణ భయంకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం ఒక్కరోజులోనే 900 పైగా కరోనా మరణాలు సంభవించాయి. గురువారం 918 మంది కరోనాతో మృతి చెందగా.. కొత్తగా 56,695 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 19,61,357 చేరింది. అటు మరణాల సంఖ్య 40 వేలు మార్కును దాటింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటకీ.. డెత్ రేటు తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తుందని అందరూ ఇటీవల భావించారు. కానీ, గత కొన్న రోజులు కరోనా మరణాలు భారీగా నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story