రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజే 62,538

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజుకు రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 62,538 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు 60 వేలకు పైగా కేసులు నమోదుకావడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది.
అటు, మరణాలు కూడా ప్రతీరోజు రికార్డు సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క రోజే 886 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు 41,585 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. ఇప్పటికవరకూ 13,78,106 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,07,384 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఓవైపు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com