భారత్‌లో కరోనా కలకలం.. కొత్తగా 61,537 కేసులు

భారత్‌లో కరోనా కలకలం.. కొత్తగా 61,537 కేసులు

దేశంలో కరోనా కేసులు ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 62వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. శనివారం 61వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. ఇప్పటివరకూ14,27,006 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,19,088మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 933 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం కరోనా మరణాలు 42,518కి పెరిగారు. అయితే, కరోనా పరీక్షలు కూడా రికార్డు స్థాయిలో జరుపుతున్నారు. శనివారం ఒక్కరోజే 5,98,778 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించినట్టు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ ప్ర‌క‌టించింది. ఇప్పటివరకూ 2,33,87,171 కరోనా పరీక్షలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ కరోనా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్తా ఊరట కలిగిస్తుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32శాతంగా నమోదైంది.

Tags

Next Story