దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 64,399 కేసులు

X
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 64,399 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 21,53,011కు చేరుకుంది. అటు, ఈరోజు861 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. ఇప్పటివరకూ 43,379 కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే, కరోనా రికవరీ రేటు కూడా గణనీయంగా ఉండటం కాస్తా ఊరట కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 14,80,885 మంది బాధితులు కోలుకోగా.. 6,28,747మంది చికిత్స పొందుతున్నారు. కాగా..దేశంలో కరోనా రికవరీ రేటు 69 శాతంగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
