ఏపీలో కొత్తగా 7,665 కరోనా కేసులు.. 80మంది మృతి

X
గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,665 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,35,525కు చేరింది. మొత్తం కేసుల్లో 1,45,636మంది కరోనా నుంచి కోలుకోగా.. 87,112 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 80 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 2116 కు చేరింది. కాగా ఏపీలో ఒక్కరోజే 46,699 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
