భారత్‌లో కరోనా.. 24 గంటల్లో 66 వేల మంది..

భారత్‌లో కరోనా.. 24 గంటల్లో 66 వేల మంది..

దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒక పక్క రికవరీ కేసులు పెరుగుతున్నా.. పాజిటివ్ కేసులు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 66,999 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే 942 కరోనాతో మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638 కాగా మరణించిన వారు 47,033 మంది. దీంతో మరణాల నిష్పత్తిలో భారత్ యూకేని దాటింది. ప్రస్తుతం భారత్ లో 6,53,622 యాక్టివ్ కేసులు ఉండగా, 16,95,982 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతంగా ఉండి కాస్త ఆశాజనకంగా ఉంది. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. తరువాతి స్థానం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలో కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story