భారత్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే వెయ్యికి పైగా మరణాలు

భారత్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే వెయ్యికి పైగా మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 64,553 మంది క‌రోనా బారిన ‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 24,61,191కి చేరాయి. ఇందులో 17,51,556 మంది ఈ మహహ్మరి నుంచి కోలుకోగా.. 6,61,595 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 1007 మంది కరోనాతో మ‌ర‌ణించారు. దీంతో మృతుల సంఖ్య 48,040కి పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా పరీక్షలు భారీగా జరుగుతున్నాయి. ఆగ‌స్టు 13న 8,48,728 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు జరిపామని ఐసీఎంఆర్ తెలిపింది. ఆగ‌స్టు చివ‌రినాటికి రోజుకు 10 ల‌క్షల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌న్న ల‌క్ష్యానికి చేరువ‌వుతున్నామ‌ని వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే దీన్ని చేరుకుంటామ‌ని పేర్కొంది.

Tags

Next Story