ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 97 మంది మృతి

ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 97 మంది మృతి

ఏపీలో కరోనా ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,73,085కి చేరాయి. అటు, కరోనా మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు 97 మంది కరోనాతో మరణించారు. ఈ రోజు నమోదైన మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,475కి చేరాయి. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,80,703 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా89,907 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా టెస్టులు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 27,58,485 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Tags

Next Story