భారత్‌లో కరోనా.. గడిచిన 24 గంటల్లో 65 వేల పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా.. గడిచిన 24 గంటల్లో 65 వేల పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ సంఖ్య మరింత పెరిగి 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా 50వేలకు చేరుకుంది. ప్రతి రోజు దాదాపుగా వెయ్యి కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 18,08,936కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,68,220 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story