లాక్‌డౌన్ విషయంలో భారత్ సరైన ప్రణాళిక అనుసరించలేదు: అభిజిత్ బెనర్జీ
నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ భారత్ లో కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఊహించిన దాని కంటే ఎక్కువ ఉందని అన్నారు. లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వం తొందరపడడమే దీనికి కారణమని అన్నారు. లాక్‌డౌన్ విధించడానికి ప్రభుత్వం తొందరపడిందని.. అలాగే, లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల్లో కూడా తొందరపడిందని అన్నారు. కరోనా వ్యాప్తి మొదలైన తొలిరోజుల్లోనే లాక్‌డౌన్ విధించిందని.. ఎక్కువ కేసులు వచ్చినపుడు లాక్‌డౌన్ విధిస్తే కరోనా కట్టడికి ఉపయోగపడేదని అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వలస కార్మికుల గురించి ఆలోచిస్తే బాగుండేదని అన్నారు. కాగా, చాలా మంది నిపుణులు, విపక్షాలు లాక్‌డైన్ విషయంలో, వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం సరైనా ప్రణాళిక లేకుండా ముందుకు పోయిందని విమర్శలు వచ్చాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com