భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 63,489 కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 63,489 కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 60వేలుకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,489 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25, 89,682కి చేరింది. అటు, ఒక్కరోజులోనే 944 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 49,980కు చేరింది.

ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 18,62,258కి చేరగా.. ఇంకా, 6,77,444 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసులతో పాటు రికవరీ రేటు కూడా గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 71.91 శాతంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story