ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు..

ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు..

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. అయినప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ప్రతి రోజూ మూడు నిమిషాలకు ఓ ఇద్దరు కరోనాతో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దాదాపు 941 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. కాగా, దేశంలో కొత్తగా 57,982 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 50,921 కాగా కోలుకున్న వారు 19 లక్షల మంది ఉన్నారు.

Tags

Next Story