ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 6,780 కేసులు నమోదయ్యాయి. గత నెలరోజులుగా ప్రతీరోజూ సుమారు పదివేలు కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కాస్తా తక్కువకేసులు నమోదవ్వడం ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,93,714కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 2,09,100 మంది కరోనాతో కోలుకోగా..84,777మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 82 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,732కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story