దేశంలో కరోనా.. 19 లక్షల మంది రికవరీ..

దేశంలో కరోనా.. 19 లక్షల మంది రికవరీ..
X

భారత్ లో వైరస్ విజృంభణ కొనసాగుతున్నా ఆదివారం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం. దేశ వ్యాప్తంగా నిన్న నమోదైన కేసుల సంఖ్య 57,981 కాగా మరణించిన వారు 941 మంది. ఇక నిన్న ఒక్కరోజులో కోలుకున్న వారి సంఖ్య చూస్తే 57 వేల మంది రికవరీ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 26,47,663 గా ఉంటే మరణాల సంఖ్య 50,921కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 19లక్షల 19వేల మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6 లక్షల 76 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.

కాగా, రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి విషయానికి వస్తే.. మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ అక్కడ 300 మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన కరోనా రోగుల సంఖ్య 20 వేలు దాటింది. నిత్యం ఇక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక ఆతరువాతి స్థానాల్లో దిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం కరోనా మరణాల రేటు అత్యధికంగా మూడు రాష్ట్రాల్లో నమోదైంది. అవి గుజరాత్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ లు వరుసగా ఉన్నాయి.

Tags

Next Story