ఏపీలో వడగండ్లతో కూడిన భారీ వర్షం

Update: 2019-06-02 12:24 GMT

ఏపీలో సాయంత్రం పలుచోట్ల అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాను భారీ వర్షం భయపెట్టింది. ఒక్కసారిగా వడగండ్లతో కూడిన భారీ వర్షం ఒక్కసారి ముంచెత్తింది.

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం గ్రామంలో వడగండ్లతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. ఒక్కొక్క వడగండ్లు 100 గ్రాములు ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.

కుప్పంతో పాటు పుత్తూరు, నగరి, నిండ్ర మండలాల్లో కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షానికి తోడు బలంగా ఈదురుగాలు వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్‌ స్థంబాలు నేలకొరిగాయి. దీంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Similar News