CBN: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ప్రజల మెడలకు ఉరితాడు

జగన్‌ పేదల వ్యతిరేకి అన్న చంద్రబాబు... తెలుగుదేశం అధినేత జననీరాజనం

Update: 2024-05-05 02:00 GMT

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చి సీఎం జగన్‌ ప్రజల మెడలకు ఉరితాడు బిగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.... ప్రజల భూమి జగన్‌ గుప్పిట్లో ఉందని చెప్పారు. ప్రజల భూ రికార్డులను ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. జగన్‌ పేదల వ్యతిరేకి అన్న చంద్రబాబు.... పేదలను చంపి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో....... బడ్జెట్‌ మొత్తం నుంచి 19 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టామని గుర్తుచేశారు. నవరత్నాలు అంటూ.. జగన్‌ ప్రజల సంపద దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

అనంతరం ఏలూరు జిల్లా నూజివీడులో, ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం తెస్తామన్నారు. సీఎం జగన్‌కు తెలిసింది విధ్వంసం మాత్రవే అన్న ఆయన ఏపీలో గనులు, భూగర్భ వనరులు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను పూరిళ్లకు పరిమితం చేసి, జగన్‌ ప్యాలెస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. కూటమి మేనిఫెస్టో చూసి జగన్‌ భయపడ్డారని, ఓటమి ఖాయమని తెలిసిపోయిందన్నారు. మే 13న జరిగే పోలింగ్‌లోకూటమి అభ్యర్థులకు ఓటేసి వైసీపీ ఐదేళ్ల అరాచకానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చంద్రబాబు ప్రజలను కోరారు.


నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే జే బ్రాండ్‌ మద్యం నిషేధిస్తాం. నాణ్యమైన లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తాం. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?ఆయన ఫొటో ఉన్న పాసు పుస్తకాలను చించిపారేయాలి. ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల భూములను జగన్‌ తన దగ్గర పెట్టుకుంటారంట. భూమి రికార్డులను ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చారు. మీ భూమి ఇప్పుడు సైకో జగన్‌ గుప్పిట్లో ఉంది. భూమి మీది.. పెత్తనం జలగది. సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు. జగన్‌ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది’’ అని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్‌ చెబుతున్నారని.. అలా అయినప్పుడు పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు చెప్పిన జగన్‌ నవరత్నాలివీ..

1. ఇసుక మాఫియా

2. జే బ్రాండ్‌ మద్యం

3. భూ మాఫియా

4. మైనింగ్‌ మాఫియా

5. హత్యా రాజకీయాలు

6. ప్రజల ఆస్తుల కబ్జా

7. ఎర్ర చందనం, గంజాయి

8. దాడులు, అక్రమ కేసులు

9. శవ రాజకీయాలు

Tags:    

Similar News