భట్టి చేపట్టిన దీక్షను.. ఆమరణ నిరాహారదీక్షగా ప్రకటించిన ఉత్తమ్‌

Update: 2019-06-08 12:49 GMT

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగింది కాంగ్రెస్. ఇందిరాపార్క్ ప్రాంగణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన 36 గంటల దీక్షను ఆమరణ నిరాహారదీక్షగా ప్రకటించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. సీఎం, స్పీకర్ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.

Similar News