తెలంగాణలో ఉన్న ఏపీ భవనాలు అప్పగించడానికి రంగం సిద్దమైంది. ఏపీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు తెలంగాణ సీఎస్ తో సమావేశమయ్యారు. అంతకుముందు ఏపీకి చెందిన ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావులు చర్చించారు. సచివాలయ భవనాలను తెలంగాణ జేఏడీకి, అసెంబ్లీ భవనాలను అసెంబ్లీ కార్యదర్శికి అప్పగించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్ కు అప్పగించనున్నారు. త్వరలోనే ఏపీ అప్పగించే భవనాల్లోకి తెలంగాణ సచివాలయం మార్చి.. ఈనెల 27లోగా కొత్త భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. మరో మూడు నెలల వరకు మంచి రోజులు లేని కారణంగా త్వరగా శంకుస్థాపనకు త్వరగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.