ఖమ్మం ఎంపి నామానాగేశ్వరరావుకు పెద్ద పదవి

Update: 2019-06-13 11:36 GMT

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కేశవరావును ఎన్నుకున్నారు. లోక్‌సభ పక్ష నేతగా ఖమ్మం ఎంపి నామానాగేశ్వరరావును, ఉప నాయకుడిగా మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డిని, విప్‌గా జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్‌ను ఎన్నుకున్నారు.

Similar News