టీటీడీ చైర్మన్‌గా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం మారినా.. తన పదవికి రాజీనామా చేయనందువల్లే తనపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. స్విమ్స్ డైరెక్టర్ తనపై పతప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారాయన. వాటిపై తక్షణం విరాచరణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషిగా తేలితే, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. స్విమ్స్ డైరెక్టర్‌కు తాను ఎమైనా సిఫార్సులు చేసినా.. జీవోల ప్రకారమే నియామకాలు జరిగాయని గుర్తుచేశారు.