కేసీఆర్, జగన్ భేటీ.. ఆ స‌మ‌స్యల ప‌రిష్కారంపై చర్చ!

Update: 2019-06-17 01:09 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ మరో ఏపీ సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. విజయవాడ వేదికగా ఇరువురు సమావేశం కానున్నారు. మధ్యా హ్నం 12.50కి గన్నవరం చేరుకుంటారు. అనతంరం విజయవాడలోని గేట్ వే హోటల్లో కేసీఆర్‌ విశాంత్రి తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1.45కి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు . అనంతరం 2.30కి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లీ ఆయనతో భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. అక్కడే ఇరువురు బోజనం చేస్తారు.

లంచ్‌ త‌రువాత ఇద్దరూ క‌లిసి తాజా రాజకీయ పరిణామాలు, విభజన సమస్యలపై చర్చించుకోనున్నారు. గ‌తంలో రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన స‌మావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రి కొన్ని స‌మ‌స్యల ప‌రిష్కారంపై చ‌ర్చించారు. ఆమేర‌కు హైద‌రాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాల అప్పగింత జరిగింది. ఇక మిగిలిన అంశాలపై ఈ సమావేశంలో చర్చింకునే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూల్‌ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది.

ఈసమావేశం అనంతరం .. ఇద్దరు సీఎంలు సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్తారు. జగన్‌, కేసీఆర్‌లతో పాటు గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ సైతం శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ ఉత్సవానికి హాజరవుతారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్‌ గన్నవరం నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

Similar News