తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళనకు త్వరలోనే శ్రీకారం చుడతామంటున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రస్తుత బోర్డును రద్దు చేస్తామని, ఆభరణాల విషయంలో అపోహలు తొలగించేందుకు విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. కొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వవివాదాలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.