Fake Liquor Case : జోగి బ్రదర్స్ కు షాక్.. తప్పులు అలాంటివి మరి..!

Update: 2025-12-19 05:02 GMT

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములు, అలాగే అద్దేపల్లి బ్రదర్స్‌ యొక్క బెయిల్‌ పిటిషన్లను ఎక్సైజ్‌ కోర్టు తిరస్కరించింది. రిమాండ్ ముగియడంతో జోగి రమేశ్ తో పాటు మరో 13 మందిని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. జోగి రమేష్, జోగి రాములు, అద్దేపల్లి బ్రదర్స్‌ రిమాండ్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది. దీనివల్ల పోలీసులు మరింత సమగ్రంగా విచారణ కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నకిలీ మద్యం కేసు ప్రధానంగా మద్యం తయారీ, విక్రయం, ఆర్థిక పరమైన లావాదేవీల చుట్టూ నడుస్తోంది.

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కీలక సాక్ష్యాలను సేకరించారు. అద్దెపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ మధ్యనే లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే ఫైల్ చేశారు. దాన్ని కోర్టులో కూడా సమర్పించారు. కీకల ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు కూడా వారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసుల్లో వారు నిందితుల నుంచి దోషులుగా మారేందుకు అన్ని ఆధారాలు రెడీ అవుతున్నాయి. కాబట్టి కోర్టు వారిని బయట తిరిగేందుకు ఒప్పుకోవట్లేదు. ఈ నెల 31 తర్వాత మరోసారి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

అయితే జోగి బ్రదర్స్ ఈ కేసులో తాము బయటకు వస్తాం అంటూ చెప్పినా సరే ఆ విధమైన పరిణామాలు ఏమీ కనిపించట్లేదు. చూస్తుంటే జోగి బ్రదర్స్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. మొదట్లో అసలు తమకు కల్తీ లిక్కర్ అంటేనే తెలియదన్నట్టు ప్రమాణాలు చేశారు జోగి రమేశ్. కానీ చేసిన తప్పులు ఎక్కడకు పోవు కదా. ఆధారాలతో సహా పోలీసులు బయట పెట్టడంతో జోగి బ్రదర్స్ ఇప్పుడు కక్షపూరిత కేసులు అటూ ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ కేసులో మరింత మందిని కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News