ఆ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2019-06-28 15:15 GMT

మున్సిపల్ ఎన్నికల కసరత్తును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రక్రియను ప్రారంభించేలా చట్టంలో సవరణ చేస్తూ.. తెలంగాణ మున్సిపల్ నిబంధనల చట్ట సవరణ 2019 ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో వార్డులను ప్రభుత్వం ఖరారు చేసింది. తాజా చట్ట సవరణకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మునిసిపల్ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Similar News