తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. ఎన్నిటికీ తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. 5 రోజుల కిందట మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారని.. కానీ ఆ పేరుకు బదులు తాను పార్టీ మారుతున్న కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన చివరి క్షణం వరకు కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు శశిధర్ రెడ్డి.