కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకాన్ని వారికి అమలు చేయాలని నిర్ణయించింది. అగ్రికల్చర్ మిషన్ సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సీజన్‌కు విత్తన సరఫరాకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయన్నారు. రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేస్తామని తెలిపారు.