ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

Update: 2019-07-07 03:46 GMT

ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కర్నాటక, జార్ఖండ్‌ రాష్ట్రప్రభుత్వాలకు దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ మార్గదర్శకాలు కూడా ఉండాలని పిటిషనర్ పెంటపాటి పుల్లారావు సుప్రీంను కోరారు. గతంలోనే దాఖలైన పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. వాదనల తర్వాత దీనిపై సీఈసీతోపాటు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం.

ఏపీలో ఏపీలో అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పేరుతో సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహాలో పథకాలు అమలు చేశారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇకపై ఇలాంటివి కొనసాగకుండా చూడాలని సుప్రీంను కోరారు. నగదు బదిలీ పథకాలు, ఉచిత పథకాల్లాంటివి రాజ్యాంగ విరుద్ధమని పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు ఇలాంటివి అమలు చేయాలని భావిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందే వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Similar News