ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తహసీల్దార్ లావణ్య ఏ స్థాయిలో లంచాలు తీసుకున్నారో ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో అనంతయ్యను విచారించడంతో ఆమె గుట్టు బయటపడింది. ఇప్పుడు తాజాగా మరోరైతు వ్యధ వీడియో బయటకొచ్చింది. గతంలో తన భూమిని తన పేరున చేయమని ఓ రైతు తహశీల్దార్ లావణ్య కాళ్లపై పడి వేడుకుంటున్నాడు.
కేశంపేట తహసిల్దార్ లావణ్య ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు షాక్‌కు గురయ్యారు. మొత్తం 93 లక్షల నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు పట్టుబడ్డాయి. దీంతో లావణ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఏసీబీ సోదాల విషయం తెలియగానే లావణ్య భర్త వెంకటేశ్ పరారయ్యాడు. షాద్‌నగర్ RDO, కేశంపేట MRO కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ACB DSP సూర్యనారాయణ తెలిపారు.