నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు.. టెన్షన్‌ లో ప్రజలు..

Update: 2019-07-13 07:54 GMT

నెల్లూరు జిల్లాలో వరుస భూప్రకంపనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా మర్రిపాడు మండలంలో మరోసారి ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు జనం. రెండు సెకన్లపాటు వచ్చిన భూ ప్రకపంనలకు ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగు తీశారు. వరుసగా నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం వచ్చిన ప్రకంపనలకు టెన్షన్‌ పడుతున్నారు గ్రామస్థులు. గత ఏడాది జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భూమి కంపించింది.

Similar News