కర్నాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ జరుపుతున్న సంప్రదింపులు ఫలిస్తున్నాయి. MTB నాగరాజుతో ఉదయం డీకే సమావేశం అయ్యారు. కృష్ణ భైరవ గౌడ సహా మరికొందరితోను మంతనాలు సాగించారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌తో తమకు ఇబ్బంది ఉందని కొందరు రెబల్స్ చెప్పగా.. హుటాహుటిన ఆయన్నీ సమావేశానికి రప్పించారు. అసంతృప్తుల డిమాండ్లకు అంతా ఓకే అన్నారు.
డీకే శివకుమార్ చర్చలు ఫలిస్తుండడంతో సంకీర్ణంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నాగరాజుతోపాటు సుధాకర్, బసవరాజ్, మునిరత్నం, సోమశేఖర్ రాజీనామాలు వెనక్కు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.