మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

Update: 2019-07-14 09:50 GMT

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జూన్‌10నే అధిష్ఠానానికి తన రాజీనామా ఇచ్చినట్లు తెలిపారు సిద్ధూ. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు పంపించారు. సిద్ధూ రాజీనామా పంజాబ్‌ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైన నాటి నుంచి.. సీఎం అమరీందర్ సింగ్‌, సిద్ధూకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సిద్ధూకు కీలక మంత్రిత్వ శాఖలను తొలించారు అమరీందర్‌. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌ అర్బన్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ విఫలం కావడానికి సిద్ధూనే కారణమంటూ అమరీందర్‌ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది.

వరుస పరిణామాల నేపథ్యంలో కలత చెందిన సిద్ధూ.. గత నెల 9న రాహుల్‌, ప్రియాంక గాంధీని కలిశారు. ఆ మరుసటి రోజే రాజీనామా లేఖను రాహుల్‌ పంపించారు. అదే లేఖను ఇవాళ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సిద్ధూ...తన రాజీనామా లేఖను సీఎం అమరీందర్‌ సింగ్‌కు పంపించారు.

Similar News