ప్రపంచకప్ ఫైనల్ విజేత అందుకున్న ప్రైజ్ మనీ..

Update: 2019-07-15 07:42 GMT

క్రికెట్ పుట్టిందే ఇంగ్లండ్ గడ్డ‌పై. అయినా ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. 1975 నుంచి మొదలు 2015 వరకు జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో 3 సార్లు ఫైనల్స్ వరకు వెళ్లినా ఇంగ్లండ్ విజేతగా నిలబడలేకపోయింది. ఈసారి ఎలాగైనా కప్ గెలుచుకోవాలన్న కసితో ఆడింది. సొంతగడ్డపైనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్‌లో కివీస్ జట్టును మట్టి కరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ట్రోఫీతో పాటు భారీగా ప్రైజ్‌మనీని కూడా గెలుచుకుంది. ఇంగ్లాండ్ గెలుచుకున్న ప్రైజ్ మనీ అక్షరాలా రూ.27.42 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.13.71 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే సెమీస్‌లో ఓడిన ఇండియా, ఆస్ట్రేలియా జట్లకు చెరో రూ.5.48 కోట్లు లభించింది. కాగా, లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కుగాను ప్రతి జట్టుకు సుమారు రూ.27.4 లక్షలు లభించాయి.

Similar News