76 ఏళ్ల పెద్దాయన.. ఆటోనే అంబులెన్స్‌గా మార్చి..

Update: 2019-07-16 07:15 GMT

ఈ వయసులో నేనేం చేయగలను.. ఏదో ఇంత ముద్ద తిని ఓ మూల పడి ఉండడం తప్ప అని తన వయసు వారిలా ఆలోచించలేదు ఆ పెద్దాయన. ఢిల్లీకి చెందిన హర్జిందర్ సింగ్ 76 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్నాడు. పని చేస్తేనే ఆరోగ్యం అంటూ రోజూ ఉదయాన్నే వీధుల్లో ఆటో తిప్పుతాడు. ఎవరి మీదా ఆధారపడకుండా తన సంపాదన తనే సమకూర్చుకుంటున్నాడు. అంతే కాదు తన జీవనాధరమైన ఆటోనే అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాన్నే అంబులెన్స్‌గా మార్చేశాడు. అందులో ఫస్ట్ ఎయిడ్ ‌కిట్‌ని ఉంచి గాయపడిన వారికి ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు ప్రాథమిక చికిత్స అందిస్తాడు. రోజుకి ఒకరైనా ప్రమాదం బారిన పడిన వారు వుంటారని.. వారిని తన ఆటోలోనే ఆసుపత్రికి తీసుకు వెళతానని అంటున్నాడు. స్థానికులు హర్జిందర్ సింగ్‌ని ఆపదలో ఆదుకునే దేవుడిగా చూస్తారు.

Similar News