హైదరాబాద్ నుంచి 170 మంది ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికి.. ఫ్లైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో.. అత్యవసరంగా వెనక్కు రప్పించి.. శంషాబాద్‌లో దించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో.. అందులోని 170 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.