తెలుగు గాయనీమణుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న గాయని స్మిత. హాయిరబ్బా అంటూ యూత్ ని ఆకట్టుకున్న అచ్చతెలుగు అమ్మాయి తర్వాత తన గాత్రాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఇరవై యేళ్ళ తన జర్నీని ఒక ఈవెంట్ గా మలిచి ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఈ నెల 22న జరగనున్న ఈవెంట్‌కు సంబంధించిన లోగో లాంచ్ కార్యక్రమంలో టివి5 ఎమ్.డి. రవీంధ్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.