57 ఏళ్ల వయసులో ఏం బుద్దులో.. చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి 59 మంది బాలికలపై..

Update: 2019-07-17 06:15 GMT

వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు. తాత వయసున్న ఆ బుద్ది లేని పెద్దాయన చిన్నారుల శరీరాన్ని తడిమి పైశాచికానందాన్ని పొందాడు. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని త్రితాలా గ్రామంలో కృష్ణన్ అనే వ్యక్తి.. ప్రైమరీ స్కూల్ ఆవరణలో పిల్లలకు కావలసిన తినుబండారాల షాపు నడుపుతున్నాడు. పాఠశాల విరామ సమయంలో బాల బాలికలంతా షాపుకి వెళ్లి కావలసినవి కొనుక్కునే వారు. ఈ క్రమంలో షాపుకి వస్తున్న చిన్నారులపై కృష్ణన్ కన్ను పడింది. బాలికల్ని లోపలికి పిలిచి వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మరికొందరిని దుస్తులు లేకుండా చేసి ఆనందించేవాడు. పైగా తాను చేసిన ఘనకార్యాలను ఎవరికీ చెప్పొద్దంటూ చిన్నారులను బెదిరించేవాడు.

గురువారం ఓ బాలికను ఇదే విధంగా వేధించడంతో చిన్నారి భయపడి పరిగెట్టుకుంటూ టీచర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరించింది. దీనిపై ఉపాధ్యాయులు ఆరా తీయగా చాలా మంది బాలికలు తమని కూడా తాత ఆ విధంగానే వేధించేవాడని 59 మంది చిన్నారులు తెలిపారు. దీంతో పాఠశాల యాజమాన్యం, బాధిత చిన్నారుల తల్లిదండ్రులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చేసిన పాడు పని బయటపడడంతో పరువు పోతుందని భావించి షాపుమూసి పరారయ్యాడు కృష్ణన్. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కేరళలో కలకలం రేపింది.

Similar News