ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప

Update: 2019-07-26 13:01 GMT

కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.. పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు రాజ్‌భవన్‌కు తరలివచ్చారు. అటు యడ్డీ ప్రమాణస్వీకారానికి అసంతృప్త ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ కూడా హాజరయ్యారు.. యడ్డీ ప్రమాణస్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌ దగ్గర రాజ్‌భవన్‌ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

Full View

కర్నాటక రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీకి సవాల్ గా మారనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేశారు.. అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందు కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఏకంగా ఈనెల 31 వరకు సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కొన్నారు.

Similar News