అక్బరుద్దీన్‌ ఓవైసీకి క్లీన్‌చిట్‌ ఇచ్చిన సీపీ కమలాసన్‌ రెడ్డి

Update: 2019-07-27 12:48 GMT

కరీంనగర్‌లో ఈనెల 23న MIM శాసనసభ ఫ్లోర్ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని తేల్చి చెప్పారు సీపీ కమలాసన్‌ రెడ్డి. న్యాయ నిపుణులతో ఆయన ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోడంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయడం లేదని సీపీ స్పష్టం చేశారు.

అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వర్గాన్ని అవమానించడంతో పాటు విద్వేషపూరితంగా.. రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆ ప్రసంగాన్ని న్యాయనిపుణులతో పోలీసులు పరిశీలించారు. అక్బరుద్దీన్ ప్రసంగంలో కేసు నమోదు చేయదగ్గ వ్యాఖ్యలు లేవని తేల్చారు. అటు అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు కరీంనగర్‌ సీపీ కమలాసన్ రెడ్డి.

Similar News