బేగంపేటలో వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన వాహనం 8 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ప్రభాకర్ ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.